![]() |
![]() |
.webp)
జీవితాలు పైకి కనిపించనంత అందంగా ఎవరివీ ఉండవు. ఏదో ఒక రూపంలో ప్రతీ మనిషీ బాధపడుతూనే ఉంటాడు ఇక బుల్లితెర మీద ఉండేవాళ్లు జీవితాల్లోనూ ఎన్నో విషాదాలు ఉంటాయి. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో జబర్దస్త్ వర్ష తన జీవితంలో జరిగిన సంఘటన చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. "రీసెంట్ నా లైఫ్ లో ఒక ఇష్యూ జరిగింది. ఏ సోషల్ మీడియాలో కూడా చెప్పలేదు. మనకు మనుషులు అనేవాళ్ళు చాలా అవసరం. మా అక్క ఏదో అడిగింది అని మా బావగారు షాప్ కి వెళ్లారు. బావగారు షాప్ కి వెళ్లి రోడ్డు దాటుతుంటే ఒక బైక్ గుద్దేసింది. బైక్ డాష్ ఇచ్చిందంటే మాములుగా దెబ్బలు తగులుతాయి. ఇంతలో మా అక్కకు ఫోన్ వచ్చింది. బావగారిని బైక్ గుద్దేసింది అని. ఇదేంటి ఇప్పుడే కదా మా ఆయన వెళ్లారు ఎం జరిగింది అనేసరికి హాస్పిటల్ కి రమ్మన్నారు. అక్కడికి వెళ్లేసరికి మా బావగారు చనిపోయి ఉన్నారు. మా బావగారు చనిపోయిన దగ్గర నుంచి అక్క డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది.
ఫోన్ చేసినా తియ్యట్లేదు. మా బావగారి బట్టలన్నీ తీసుకుని ఒక రూమ్ లో వేసుకుని వాటి మీద పడుకుంటుందట.. బావగారి శవాన్ని అలా తీసుకొస్తున్నప్పుడు మా అక్క వాళ్ళ అబ్బాయి నన్ను హగ్ చేసుకుని పిన్ని అసలు మాకు టిఫన్ తెచ్చుకోవడం కూడా తెలీదు పిన్ని. రేపటి నుంచి మేము ఎవరిని అడగాలి" అని అడిగేసరికి చాలా బాధేసింది. డబ్బులు కచ్చితంగా ఇంపార్టెంట్ కాదు. ఇంతకు ముందు నేను చాలా మూర్ఖంగా ఉండేదాన్ని డబ్బులు ఉండాలి అని..డబ్బులు లేకపోతే పాల ప్యాకెట్ కూడా రాదు..కష్టపడాలి పని చేయాలి అని ఇంట్లో వాళ్ళను తిట్టేదాన్ని. కానీ మనుషులు చాలా అవసరం అన్న విషయం తెలుసుకున్నా...బైక్ డ్రైవ్ చేసే వాళ్ళు చూసుకుని చేయండి. అంటూ ఎమోషనల్ అవుతూ చెప్పింది వర్ష.
![]() |
![]() |